News April 16, 2025
‘వక్ఫ్’పై ఆందోళనలు హింసాత్మకం కావడం బాధాకరం: సుప్రీం

వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ జరిగిన <<16100810>>ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై<<>> సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘటనలు తమను బాధించాయని పేర్కొంది. అనంతరం వక్ఫ్ చట్టంపై ప్రశ్నించగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జవాబిచ్చారు. ‘వక్ఫ్ చట్టం కోసం చాలా కసరత్తు చేశాం. బిల్లుపై JPC 38 సమావేశాలు నిర్వహించింది. 98.2 లక్షల విజ్ఞప్తుల్ని పరిశీలించింది’ అని తెలిపారు.
Similar News
News April 19, 2025
IPL: ముగిసిన డీసీ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే..

అహ్మదాబాద్‌లో జరుగుతున్న IPL మ్యాచ్‌లో డీసీ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది. అశుతోశ్ (19 బంతుల్లో 37), అక్షర్ (32 బంతుల్లో 39), నాయర్ (18 బంతుల్లో 31) రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 4, సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ తీసుకున్నారు. GT విజయ లక్ష్యం 204 పరుగులు.
News April 19, 2025
ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్‌తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.
News April 19, 2025
అజహరుద్దీన్‌కు షాక్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు ఆయన పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య HCAను ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టారు. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టాండ్స్‌కు తన పేరు పెట్టాలని అజర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చారు.