News April 16, 2025
‘నాగర్‌కర్నూల్ జిల్లాలో దరఖాస్తు గడువు పొడిగించాలి’

నాగర్ కర్నూల్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువులు పొడిగించాలని సీపీఐ పట్టణ అధ్యక్షుడు కొత్త రామస్వామి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని కామ్రేడ్ లక్ష్మణ చారి భవన్‌లో సీపీఐ సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువు లోపల సెలవు దినాలు అధికంగా రావడంతో నిరుద్యోగులకు ఆటంకంగా మారిందని వారన్నారు. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 19, 2025
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

AP: విశాఖ <<16147304>>మేయర్ పీఠం కూటమి<<>> ప్రభుత్వం దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు రాజకీయాలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. YCP 58 స్థానాలు గెలిస్తే, కూటమి 30 సీట్లే గెలిచిందని, ఏ రకంగా మేయర్ పదవి వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
News April 19, 2025
HYD: ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News April 19, 2025
OU: ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలు విడుదల