News April 16, 2025

‘అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలి’ 

image

అలంపూర్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించి అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు ఏర్పాటుచేసి వెంటనే అందుబాటులో తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి . వెంకటస్వామి డిమాండ్ చేశారు. CPM ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు GK.ఈదన్న, A.పరంజ్యోతి, రమేశ్, ఉండవెల్లి మండల నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

ధర విషయంలో దీని ముందు బంగారం ‘జుజూబీ’!

image

బంగారం రేటు చూసి మనం షాక్ అవుతాం. కానీ కాలిఫోర్నియం (Cf-252) అనే మెటల్ ధర ముందు అది జుజూబీ! ఒక గ్రాము బంగారం ధర దాదాపు ₹14,000 ఉంటే.. ఒక గ్రాము Cf-252 ధర దాదాపు ₹243 కోట్లు. అంటే ఒక గ్రాము కాలిఫోర్నియంతో సుమారు 171 కిలోల బంగారం కొనొచ్చన్నమాట! ఇది సహజంగా దొరకదు. కేవలం న్యూక్లియర్ రియాక్టర్లలో కృత్రిమంగా తయారు చేస్తారు. క్యాన్సర్ చికిత్సలో, చమురు బావుల గుర్తింపులో దీని రేడియోధార్మికత చాలా కీలకం.

News January 12, 2026

NGKL: సంక్రాంతి ప్రయాణికులు జాగ్రత్త: ఎస్పీ

image

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచించారు. విలువైన నగలు, నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి, లోపల లైట్లు ఉంచాలని, ప్రయాణ సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్‌లో తెలపాలని ఆయన సూచించారు.

News January 12, 2026

జోగులాంబ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

అలంపూర్ జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు (జనవరి 19-23), బాలబ్రహ్మేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు (ఫిబ్రవరి 14-18) హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలను ఆలయ బృందం ఆహ్వానించింది. సోమవారం హైదరాబాద్‌లో వారిని కలిసిన ఈవో దీప్తి, అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు.