News April 16, 2025

పార్టీ పటిష్ఠతకు కమిటీలు ఏర్పాటు చేయాలి: రాజశేఖర్ రెడ్డి

image

పార్టీని పటిష్ట పరిచేందుకు బీజేపీ మండల కమిటీలను జిల్లా కమిటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖరరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘటన సంరచనా సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఘటన సంరచనా ప్రభారి పడాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 20లోగా కమిటీలు పూర్తి చేయాలన్నారు.

Similar News

News April 19, 2025

ఖమ్మంలో 10 ఆసుపత్రులు సీజ్ : DMHO

image

CMRF బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఖమ్మంలోని 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO డా.కళావతి బాయి తెలిపారు. శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయిమల్టీ స్పెషాలిటీ, వైష్ణవి, సుజాత, ఆరెంజ్, న్యూ అమృత, మేఘ, JR ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి మూసివేసినట్లు చెప్పారు. చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లును సృష్టించి CMRF నిధులను కాజేశారని పేర్కొన్నారు.

News April 19, 2025

కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం 

image

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం నూతన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని సందర్శించి అక్కడ ఉండే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.

News April 19, 2025

IPL: ముగిసిన డీసీ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే..

image

అహ్మదాబాద్‌లో జరుగుతున్న IPL మ్యాచ్‌లో డీసీ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది. అశుతోశ్ (19 బంతుల్లో 37), అక్షర్ (32 బంతుల్లో 39), నాయర్ (18 బంతుల్లో 31) రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 4, సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ తీసుకున్నారు. GT విజయ లక్ష్యం 204 పరుగులు.

error: Content is protected !!