News April 16, 2025
ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ: విశాఖ జేసీ

విశాఖలో ఇళ్ల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 30 కింద దరఖాస్తుదారులు సమీప గ్రామ, వార్డు సచివాలయలలో అందజేయాలని జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ తెలిపారు. నిర్దేశిత డాక్యుమెంట్లతో పాటు, వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,20,000, పట్టణాల్లో రూ.1,44,000గా ఉండాలన్నారు. ఖాళీస్థలాలు, పూరిగుడిసెల క్రమబద్ధీకరణకు అనర్హమని అన్నారు. కుటుంబంలో స్త్రీ పేరున దరఖాస్తు చేయాలని సూచించారు.
Similar News
News April 19, 2025
విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.
News April 19, 2025
వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.
News April 19, 2025
విశాఖ కొత్త మేయర్ ఆయనేనా?

జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గడంతో కొత్త మేయర్ ఎవరన్న సందిగ్ధంలో కార్పొరేటర్లు ఉన్నారు. కూటమిలో పలువురు ఆశావాహులు మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాస్‌కే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే డిప్యూటీ మేయర్ పదవికి అవిశ్వాసం జరిగితే ఆ పదవి జనసేనకు కేటాయిస్తారని కూటమి వర్గాల్లో చర్చనడుస్తోంది.