News April 16, 2025
ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ గాదె

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు బుధవారం రాష్ట్ర శాసన మండలి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యా మోషేన్ రాజు శ్రీనివాసులు నాయుడుతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ ప్రతినిధులు అధికారులు ఆయనను అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.
Similar News
News January 22, 2026
సహజీవనంలో మహిళకు భార్య హోదా ఇవ్వాలి: హైకోర్ట్

లివింగ్ రిలేషన్‌లో ఉండే మహిళలకు గాంధర్వ వివాహం/ప్రేమపెళ్లి కింద ‘భార్య’ హోదా కల్పించాలని మద్రాస్ హైకోర్ట్ అభిప్రాయపడింది. పెళ్లిపేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాచీన భారతదేశంలోని 8 వివాహాల్లో గాంధర్వ వివాహం ఒకటి. సహజీవనాన్ని ఈ వివాహంగా గుర్తించొచ్చు. ఈ విషయాల్లో BNSలోని Sec68 మహిళలకు రక్షణ కల్పిస్తుంది’ అని తెలిపారు.
News January 22, 2026
ఖమ్మంలో జేఈఈ మెయిన్స్ షురూ.. తొలిరోజు 98 శాతం హాజరు!

ఖమ్మం జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 1,748 మంది అభ్యర్థులకు గాను 1,721 మంది (98.4%) హాజరైనట్లు కో-ఆర్డినేటర్ పార్వతీరెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గంట ముందుగానే తనిఖీలు పూర్తి చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.
News January 22, 2026
కేయూ అధ్యాపకులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి

కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులందరికీ ఫేస్ రికగ్నిషన్ హాజరును పకడ్బందీగా అమలు చేయడానికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు చేయని అధ్యాపకులు గురువారం తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.


