News April 16, 2025
మరోసారి నిరాశపరిచిన ‘మెక్‌గర్క్’

ఢిల్లీ బ్యాటర్ మెక్‌గర్క్ మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్లు కనిపించినా 9 పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్సుల్లో 55 పరుగులే చేశారు. ఇందులో అత్యధికం 38 రన్స్. గత ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్ ఈ సారి తేలిపోతున్నారు. మరి తర్వాతి మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకొని ఢిల్లీకి శుభారంభం అందిస్తారో లేదో వేచిచూడాలి.
Similar News
News April 19, 2025
ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్‌తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.
News April 19, 2025
అజహరుద్దీన్‌కు షాక్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు ఆయన పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య HCAను ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టారు. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టాండ్స్‌కు తన పేరు పెట్టాలని అజర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చారు.
News April 19, 2025
సన్‌రూఫ్ కార్లపై తగ్గుతున్న ఇంట్రెస్ట్!

సన్‌రూఫ్ కార్లపై మక్కువ తగ్గిపోతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 78శాతం మంది కార్ల కొనుగోలుదారులు సన్‌రూఫ్‌కి బదులుగా వెంటిలేటెడ్ సీట్లున్న కార్ మోడళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. సన్‌రూఫ్ వల్ల ఏడాది పొడవునా వెచ్చగా, సమ్మర్‌లో మరింత వేడిగా ఉంటోంది. అదే వెంటిలేటెడ్ సీటుతో చల్లగా, వెచ్చగా మార్చుకునే సదుపాయం లభిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ దేనికి? COMMENT