News April 16, 2025

సంగారెడ్డి: భూభారతిపై అవగాహన పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 17 నుంచి 30 వరకు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు రైతులను పిలిచి భూభారతి చట్టం గురించి పూర్తిస్థాయిలో వివరించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్, అదనపు కలెక్టర్ మాదిరి పాల్గొన్నారు.

Similar News

News December 31, 2025

శేష జీవితం ఆరోగ్యం, ఆనందంగా గడపండి: ఎస్పీ మాధవరెడ్డి

image

ఉద్యోగ విరమణ అనేది వృత్తికేని శరీరాన్ని కాదని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. బుధవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐ తిరుపతిరావును ఘనంగా సన్మానించారు. సభలో ఎస్పీ మాట్లాడుతూ..శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని కోరారు. ఉమ్మడి జిల్లాల్లో పోలీస్ శాఖలో సేవలు మరువలేనిదని కొనియాడారు. జిల్లా పోలీసు అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

News December 31, 2025

ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు ముగ్గురికి జన్మనివ్వండి: అస్సాం CM

image

హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపొద్దని, ఇద్దరిని కనాలని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ కోరారు. అవకాశం ఉన్నవాళ్లు ముగ్గురికి జన్మనివ్వాలన్నారు. రాష్ట్రంలో హిందువుల బర్త్ రేట్ తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 7-8 మంది పిల్లల్ని కనొద్దని ముస్లింలను కోరారు. AP CM CBN కూడా ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని కోరుతున్న విషయం తెలిసిందే.

News December 31, 2025

VKB: న్యూ ఇయర్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు: SP

image

మహిళల రక్షణ కోసం షీ-టీమ్స్‌, బైక్ రేసింగ్‌ల నిర్వహన కట్టడికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. రిసార్ట్స్ నిర్వాహకులు అతిథిల వివరాలను నమోదు చేయాలన్నారు. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత వేడుకలకు అనుమతి లేదన్నారు. వైన్ షాప్‌లు, బార్లు నిర్ణిత సమయం వరకు అనుమతి ఉందన్నారు. మద్యం అనుమతి తీసుకున్న రిసోర్ట్స్, ఫార్మ్ హౌస్‌లలో ప్రభుత్వ నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు.