News April 16, 2025

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ బదిలీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకార్ జైన్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన జాయింట్ కలెక్టర్ నియమించే వరకు బాపట్ల జిల్లాకు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌ను నియమించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News December 25, 2025

పల్నాడు జిల్లాకు అంది వస్తున్న అవకాశాలు.!

image

రాజధాని అమరావతి అభివృద్ధిలో పల్నాడు జిల్లా అంతర్భాగం కావడంతో అవకాశాలు అందివస్తున్నాయి. జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు మండలాల్లో భూ సేకరణ జరగబోతుంది. పల్నాడులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, IT, స్పోర్ట్స్ సిటీ (2,500 ఎకరాలు), టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. 1.5 మిలియన్ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు రాకతో భూముల రేట్లు, పెట్టుబడుల అవకాశాలు పెరిగాయి.

News December 25, 2025

సూర్యాపేట: 2025 రిపోర్ట్.. తగ్గిన నేరాలు

image

పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2025ను ఎస్పీ నరసింహ విడుదల చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాలు 12శాతం తగ్గాయి. గతేడాది 536 చోరీ కేసులు నమోదు కాగా అవి ఏ సంవత్సరం 360గా ఉన్నాయి. పోయినేడు 84 లైంగిక దాడుల కేసులు నమోదవగా ఈ సంవత్సరం 45 కేసులు ఫైలయ్యాయి. 2024లో 622 రోడ్డు ప్రమాదాల్లో 278 మంది చనిపోగా, ఈ ఏడాది 563 యాక్సిడెంట్లలో 204 మంది మృత్యువాత పడ్డారు. 26శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయి.

News December 25, 2025

విద్యార్థుల తల్లిదండ్రులకు లెటర్ రాసిన హరీశ్‌రావు

image

సిద్దిపేట MLA హరీశ్ రావు పదవతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. మార్చ్‌లో పరీక్షలు ఉన్నాయని, వచ్చే మూడునెలలు TV, ఫోన్‌లను దూరంగా ఉంచాలన్నారు. సినిమాలు, వినోదాలు, ఫంక్షన్‌లకు వెళ్లకుండా చూడాలని చెప్పారు. సిద్దిపేట అన్నింట్లో ఆదర్శంగా ఉందని, మరోమారు పదవతరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. కృషి ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నారు.