News April 17, 2025
కర్నూలు: అక్షరాస్యతకై ‘ఉల్లాస్’ కార్యక్రమం

వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ఆదేశించారు. బుధవారం కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఉల్లాస్” కార్యక్రమంపై జిల్లాస్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశాన్ని డీఆర్వో నిర్వహించారు. కార్యక్రమం అమలుపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
Similar News
News September 30, 2025
కర్నూలు జిల్లా పీఈటీకి అరుదైన అవకాశం

కర్నూలు జిల్లా నందవరం జడ్పీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సూరజ్‌కు అరుదైన అవకాశం లభించింది. ఆంధ్ర రాష్ట్ర బాలుర ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఆయనను నియమించారు. శ్రీనగర్‌లో అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే అండర్-19 జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆంధ్ర రాష్ట్ర బాలుర జట్టుకు ఆయన శిక్షణ ఇవ్వనున్నారు.
News September 29, 2025
కర్నూలు ఎస్పీ గ్రీవెన్స్ డేకు 79 ఫిర్యాదులు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 79 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి తీసుకున్న అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ స్కూల్లో టీచర్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన మాధప్ప రూ.14.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని దొరస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
News September 29, 2025
నెలకు రూ.వెయ్యి ఆదా: కర్నూలు కలెక్టర్

కర్నూలు: జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పోస్టర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.వెయ్యి వరకు ఆదా అవుతోందని తెలిపారు.