News April 17, 2025

ప.గో: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 18.5 లక్షలు, రూ. 8.31 లక్షలు, రూ.2.41 లక్షల వ్యయంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మూడు వసతి గృహాలకు చేపట్టిన నిర్మాణ పనులను  కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News September 10, 2025

హెక్తాన్-25 విజేతలకు బహుమతుల ప్రదానం

image

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హెక్తాన్-25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్‌, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, గైడ్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజమండ్రి కళాశాల నిలిచాయి.

News September 10, 2025

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో బుధవారం సమీక్షించారు. కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

News September 10, 2025

‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

image

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.