News April 17, 2025

మహబూబ్‌నగర్: అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Similar News

News March 5, 2026

మహబూబ్‌నగర్: 254 మంది విద్యార్థులు గైర్హాజరు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మ్యాథమెటిక్స్ జువాలజీ హిస్టరీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 254 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నేటి పరీక్షకు మొత్తంగా 10,156 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,902 విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష సందర్భంగా ఇటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.

News March 5, 2026

పాలమూరు: GOVT పథకాలపై వర్క్ షాప్

image

మహబూబ్ నగర్ లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమ శాఖ అధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమన్నారు. SBI,RSETI సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, యువజన అధికారి కోటా నాయక్, శిక్షణ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News March 4, 2026

మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ!

image

మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.