News April 17, 2025
రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

రేషన్ కార్డులకు సంబంధించి కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రేషన్ కార్డుల విచారణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News January 16, 2026
MBNR: సొంతూళ్లకు చేరిన వలస జీవులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధి కోసం ముంబై, పుణే, సూరత్, సోలాపూర్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారు పండుగ రోజున సొంతూళ్లకు వచ్చారు. మూడు రోజుల పండగ కోసం లక్షలాది మంది తరలిరావడంతో జిల్లాలోని పల్లెలన్నీ జనసందోహంతో కళకళలాడుతున్నాయి. వలసలతో వెలవెలబోయే ఆయా గ్రామాలు వారి రాకతో పండుగ పూట సందడిగా మారాయి.
News January 16, 2026
క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
News January 16, 2026
కరీంనగర్‌కు కనుమ శోభ.. మూగజీవాలకు మొక్కులు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజైన కనుమ పర్వదినాన్ని రైతులు ‘పశువుల పండుగ’గా జరుపుకుంటారు. ఈ క్రమంలో నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు ఉదయాన్నే ఎద్దులు, ఆవులకు స్నానాలు చేయించారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


