News April 17, 2025

ASF: వైద్య సిబ్బందికి DMHO హెచ్చరికలు

image

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. బుధవారం చింతలమానేపల్లి మండలం దిందా పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చేందుకు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు.

Similar News

News February 28, 2026

పనీర్ vs సోయా చంక్స్: ప్రొటీన్ లెక్కల్లో ట్విస్ట్

image

పనీర్ కంటే సోయా చంక్స్‌లోనే ప్రొటీన్ ఎక్కువ. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రొటీన్ ఉంటే సోయాలో 52 గ్రాములు ఉంటుంది. కానీ, మనం ఒకేసారి 100 గ్రాముల పనీర్ తినగలం. అదే సోయా చంక్స్ ఉడికాక అంత మొత్తంలో తినడం కష్టం. సాధారణంగా మనం తినగలిగే 20 గ్రాముల సోయా ద్వారా 10 గ్రాముల ప్రొటీనే అందుతుంది. కాబట్టి ప్రొటీన్ డెన్సిటీలో సోయా బెటర్ అయినా.. శరీరానికి అందే పోషకాల పరంగా మాత్రం పనీర్ బెస్ట్ ఛాయిస్.

News February 28, 2026

బంగారం ధరల ఎఫెక్ట్.. ₹4 లక్షల కోట్లకు లోన్స్!

image

బ్యాంకుల రిటైల్ రుణాల్లో గోల్డ్ లోన్స్ వాటా గతేడాదితో పోలిస్తే 3% నుంచి 6%కి పెరిగింది. జనవరి నాటికి గోల్డ్ లోన్స్ 128% వృద్ధి చెంది దాదాపు ₹4 లక్షల కోట్లకు చేరాయి. బంగారం ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రిటైల్ విభాగంలో క్రెడిట్ కార్డ్ లోన్స్ తగ్గగా వెహికల్ లోన్స్ 17% వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం డిపాజిట్లు ₹247.7 లక్షల కోట్లుగా ఉండగా లోన్లు ₹204.32 లక్షల కోట్లకు చేరాయి.

News February 28, 2026

కొన్నిసార్లు మిలిటరీ యాక్షన్ తప్పదు.. ఇరాన్‌పై ట్రంప్

image

ఇరాన్‌తో జరుగుతున్న చర్చల పట్ల ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించడం లేదంటూ పెదవి విరిచారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. అయితే వారు చిత్తశుద్ధితో చర్చలు జరపడం లేదని విమర్శించారు. తాము మిలిటరీని వాడొద్దనే అనుకుంటున్నామని, కానీ కొన్నిసార్లు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. సైనిక చర్య వల్ల మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలను కొట్టిపారేయలేమన్నారు.