News April 17, 2025
ఉమ్మడి కరీంనగర్ వాసులు.. వీటిలో ఎక్కడికి వెళ్తున్నారు? 2/2

అదేవిధంగా ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. రామగిరి ఖిల్లా, JGTL ఖిల్లా, ధూళికట్ట బౌద్ద స్తూపం, మానేర్ డ్యామ్, ఎలంగందుల ఖిల్లా, జింకలపార్కు, నగునూరు కోట, KNR కేబుల్ బ్రిడ్జి, పురావస్తు ప్రదర్శనశాల, నాగులపేట సైఫన్, మొలంగూరు ఖిల్లా, ఉజ్వలపార్కు, డీర్ పార్కు నాంపల్లి, అలాగే గోదావరినదిపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రామగుండంలోని రాముని గుండాలు సందర్శకులకు చూడదగినవి.
Similar News
News January 31, 2026
బిల్ గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం

బిల్ గేట్స్ గురించి <<19008385>>ఎప్‌స్టీన్ ఫైల్స్<<>> తాజాగా షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత ఆయనకు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ రాసుకున్న మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని దాచిపెట్టి భార్య మెలిందాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని యత్నించారని పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ఖండించారు. తనను బ్లాక్ మెయిల్ చేయడానికే ఎప్‌స్టీన్ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేశాడని చెప్పారు.
News January 31, 2026
నెల్లూరులో పోలీసుల ఆట చూశారా..?

నెల్లూరు పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026 ఏర్పాటు చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల పావురాలు, బెలూన్లు విడిచిన అనంతరం స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీ సహా పలు విభాగాల్లో పోటీలు మూడు రోజుల జరగనున్నాయి. తొలిరోజు సిబ్బంది ఉల్లాసంగా పోటీల్లో పాల్గొన్నారు.
News January 31, 2026
కృష్ణా: థైరాయిడ్ పరీక్ష చేసే యంత్రం పనిచేయక రెండేళ్లు.!

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం నిరుపేదలకు శాపంగా మారింది. రూ. 1.50 కోట్ల విలువైన యంత్రం ఉన్నా, రసాయనాలు లేవనే సాకుతో రెండేళ్లుగా T3, T4 పరీక్షలు నిలిపివేశారు. ఫలితంగా నిత్యం వందలాది మంది గర్భిణులు, రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించి రూ. 600 వరకు వెచ్చించాల్సి వస్తోంది. కేవలం ప్రాథమిక పరీక్షలకే పరిమితమైన GGH తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


