News April 17, 2025

సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు: సీఐ

image

మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్ట్ పెట్టిన వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండవ పట్టణ సీఐ రామచంద్ర తెలిపారు. మదనపల్లె‌లోని శివాజీ నగర్‌లో ఉండే మహబూబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఎక్స్‌లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Similar News

News December 16, 2025

NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.

News December 16, 2025

GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

image

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

News December 16, 2025

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.