News March 27, 2024
వనపర్తి: ‘యాప్‌లో రూ.1,75,000 పోగొట్టుకున్నాడు’

వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ వేక్ (WAKE) యాప్‌లో రూ.1, 75,000 పోగొట్టుకున్నాడని ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. బాధితుడు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 28, 2026
MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!
News March 28, 2026
MBNR: పారుపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం పారుపల్లిలో 39.0 అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. దేవరకద్ర, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 38.9, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట 38.8, మహబూబ్‌నగర్ అర్బన్ 38.7, అడ్డాకుల 38.6, భూత్పూర్ మండలం కొత్త మొల్గర, మిడ్జిల్ మండలం దోనూరు, నవాబుపేట మండలం కొల్లూరు 38.5, హన్వాడ 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.
News March 28, 2026
డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి

డోర్నకల్-గద్వాల మధ్య 296km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుంది. ఈ లైన్ సింగరేణి బొగ్గు రవాణాకు & తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల కనెక్టివిటీకి, సామాజిక- ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జడ్చర్ల-నంద్యాల లైన్ ట్రాఫిక్ (182km) తక్కువగా ఉన్నట్లు తెలిపారు.


