News April 17, 2025
అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్, కో-లివింగ్ కల్చర్ కూడా గ్రేటర్లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.
Similar News
News January 13, 2026
RR: వారికి రేషన్ డీలర్ కట్ చేస్తాం: మాచన

రంగారెడ్డి జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారని ఇది గొప్ప పరిణామమని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. కానీ సర్పంచ్‌లు అయ్యాక డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసిన డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే డీలర్ షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు.
News January 9, 2026
HYD: 2 రోజులు వాటర్ బంద్

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
News January 8, 2026
తలకొండపల్లి: రేపటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

తలకొండపల్లి మండలం వెల్జాల్లో వెలసిన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా 9న గణపతి పూజ, లక్ష్మీనరసింహస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, 10న పుష్పార్చన, అభిషేకం, బండ్లు తిరుగుట, 11న మధ్యాహ్నం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


