News March 27, 2024

ఆ రికార్డును ఏ జట్టు బద్దలు కొడుతుంతో!

image

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించి ఆర్సీబీ రికార్డును బ్రేక్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక (263), అత్యల్ప(49) పరుగుల రికార్డు బెంగళూరు పేరుపై ఉండగా ఇవాళ SRH అత్యధిక పరుగుల(277) రికార్డును బద్దలు కొట్టింది. ఇక RCB అత్యల్ప పరుగుల చెత్త రికార్డును ఏ జట్టు బద్దలు కొడుతుందని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి..

Similar News

News January 16, 2026

SSC కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

image

సాయుధ బలగాల్లోని 8 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి SSC నిర్వహించిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 53,690 పోస్టుల ఎంపికకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్‌‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. గతేడాది ఫిబ్రవరిలో CBT నిర్వహించగా 24లక్షల మంది పాల్గొన్నారు. జూన్‌లో PET, PST, ఆగస్టు నుంచి SEP వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించారు. అఫీషియల్ <>వెబ్‌సైట్‌<<>>లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News January 16, 2026

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 16, 2026

యెమెన్ ప్రధాని సలేం బిన్ బ్రేక్ రాజీనామా

image

యెమెన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి సలేం బిన్ బ్రేక్ రాజీనామా చేయగా, విదేశాంగ మంత్రి షయా మొహ్సిన్ అల్ జిందానీ కొత్త PMగా నియామకం అయ్యారు. యెమెన్ పాలక ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ యెమెన్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల మధ్య ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.