News April 17, 2025

సిరిసిల్ల: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి: ఎస్పీ

image

లాడ్జీ యజమానులు లాడ్జీలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సూచించారు. లాడ్జీలలో వచ్చే వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలన్నారు. లాడ్జీల కేంద్రగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. లాడ్జీలలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News April 19, 2025

సిక్సర్ల రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ KL రాహుల్ రికార్డు సృష్టించారు. IPLలో భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్సులలో 200 సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో సిక్సర్ బాది రాహుల్ ఈ ఫీట్ సాధించారు. రాహుల్ 129 ఇన్నింగ్సుల్లో 200 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 69Inns, ఆండ్రీ రస్సెల్ 97Inns తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

News April 19, 2025

అరెస్టైన కాసేపటికే నటుడికి బెయిల్

image

నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ మంజూరైంది. నటితో అసభ్యకరంగా ప్రవర్తించారనే కేసులో ఇవాళ మధ్యాహ్నం ఆయనను కొచ్చి పోలీసులు <<16150036>>అరెస్ట్<<>> చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కొచ్చి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దసరా సినిమాతో ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

News April 19, 2025

నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి: మంత్రి

image

సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌‌తో కలిసి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

error: Content is protected !!