News April 17, 2025
KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.
Similar News
News January 14, 2026
MHBD జిల్లాలో నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు

నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆరు విడతలగా శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఇందులో PR చట్టం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం, GPలో నిర్వహించాల్సిన బాధ్యతలను వివరిస్తారు. వీరికి DLPOలు టీచర్ ఆఫ్ ట్రైనేర్స్(TOT)గా వ్యవహరిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో 482 మంది నూతన సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
News January 14, 2026
నారావారిపల్లెలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులు ఏమన్నారంటే .!

నారావారిపల్లె సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలో జరిగిన ఘటనపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. పెద్దపంజాణి మండలానికి చెందిన గోవిందరెడ్డి తన సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చారని తెలిపారు. అతనిని పోలీసులు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. గోవిందరెడ్డి క్యూలైన్లోకి రాకుండా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు.
News January 14, 2026
ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. ఎవరు గెలుస్తారో?

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 28 ఓవర్లలో 134/2 రన్స్ చేసింది. మిచెల్, యంగ్ హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ విజయానికి మరో 132 బంతుల్లో 151 రన్స్ అవసరం. ప్రసిద్ధ్, హర్షిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


