News April 17, 2025
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలెక్టర్ కాన్ఫరెన్స్ కాల్

విజయవాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గురువారం ఉచిత ఇసుక, తాగు నీటి సరఫరా, ఏంఎస్ఏంఈ సర్వే, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జె. వెంకట మురళి, జిల్లా అధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు.
Similar News
News January 12, 2026
HYD: నీటితో ఆటలాడితే.. నల్లా కనెక్షన్ కట్

మహానగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలకు సిద్ధమైంది. వాహనాల వాషింగ్, గార్డెనింగ్, రోడ్లపై నీటిని వృథా చేస్తే రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనుంది. 2సార్లు అవకాశం ఇచ్చి, ఆపై నల్లా కనెక్షన్ కట్ చేస్తారు. నీటి వృథాపై ఫొటో, లొకేషన్‌తో ‘పానీ యాప్’లో సమాచారం పంపేందుకు 10 వేల మంది వాటర్ వాలంటీర్లను రంగంలోకి దింపనున్నారు. 15 రోజుల్లో యాప్ అందుబాటులోకి రానుంది.
News January 12, 2026
నిజామాబాద్: సన్మానాలేనా సమస్యలు తీర్చేదేమైనా ఉందా?

ఇటీవల ఎన్నికైన సర్పంచులు సన్మానాలు, సత్కారాలతో బిజీగా ఉన్నారు. వివధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు సర్పంచులను సన్మానాలు చేస్తున్నాయి. అయితే సర్పంచులుగా ఎన్నికై దాదాపు నెలరోజులైనా గ్రామాల్లోని సమస్యలపై కాకుండా సన్మానాలపై ఫోకస్ పెట్టినట్లు పలువురు విమర్శిస్తున్నారు. సన్మానాలేనా సమస్యలు తీర్చేదేమైనా ఉందా అని అడుగుతున్నారు.
News January 12, 2026
శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి యాగశాల ప్రవేశం వైభవంగా సాగింది. రాత్రి 7గం.కు నిర్వహించే ప్రధాన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. రేపట్నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న సంక్రాంతి వేళ బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది. 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. 18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలు నిలిచిపోనున్నాయి.


