News April 17, 2025
వనపర్తి: బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: చిన్నారెడ్డి

రాహుల్ గాంధీకి పెరుగుతోన్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారని, అందుకే అక్రమ కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆరోపించారు. వనపర్తిలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ సంకల్పం ముందు మోదీ కుట్రలు పనికిరావని చిన్నారెడ్డి హెచ్చరించారు. రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరే రాములు, గడ్డం వినోద్, అబ్దుల్లా ఉన్నారు.
Similar News
News February 28, 2026
బైరెడ్డి ఎప్పటికీ నా శత్రువే: గౌరు వెంకటరెడ్డి

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనకు ఎప్పటికీ శత్రువేనని టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అతడు ఎన్నడూ మాట మీద నిలబడలేదని విమర్శించారు. తనపై గతంలో రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించారని ఆరోపించారు. కేవలం సీఎం చంద్రబాబుపై గౌరవంతోనే గత ఎన్నికల్లో కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. ఎంపీ శబరి ఎమ్మెల్యేల సహకారంతో నియోజకవర్గ పర్యటనలు చేస్తే బాగుంటుందని సూచించారు.
News February 28, 2026
ఆసిఫాబాద్: డిగ్రీ విద్యార్థి సూసైడ్

రెబ్బెన (M) దుర్గాపూర్‌కు చెందిన మడావి అజయ్(18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకట కృష్ణ కథనం ప్రకారం.. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజయ్ 2 సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గత నెల 27న వైద్యం కోసమని వెళ్లి గ్రామ శివారులో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా శుక్రవారం మృతి చెందాడు.
News February 28, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. జడ్జి జస్టిస్ జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు

* అప్రూవర్ వాంగ్మూలాన్నే నిజంగా భావించి పరిశీలన లేకుండానే కేసు పెట్టారు.
* సాక్ష్యాధారాలు లేకపోయినా ఊహాగానాలతో <<19251338>>కేసును<<>> నిర్మించారు.
* PMLAలో కఠిన నిబంధనల వల్ల వాస్తవాలను పరీక్షించకముందే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల వ్యక్తుల స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది.
* దర్యాప్తు లోపాలపై కోర్టు మౌనంగా ఉండటమంటే విధి నిర్వహణ నుంచి తప్పుకోవడమే.
* ఆకాశం కూలినా సరే న్యాయం జరగాల్సిందే.


