News March 28, 2024
ఒంగోలు: ‘బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి’

వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలకు కూడా లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రకాశ్ భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఎస్.హెచ్.జి మహిళల జీవనోపాధి మరింత మెరుగుపడేలా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యా రుణాలు మంజూరు వేగవంతం చేయాలన్నారు.
Similar News
News March 11, 2026
ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.
News March 11, 2026
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, ఫైనల్ మెరిట్ జాబితాను మంగళవారం జిల్లా కో-ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.
News March 11, 2026
ప్రకాశం: ఆసుపత్రులలో జాబ్స్.. తుది జాబితా విడుదల..!

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల ఫైనల్ మెరిట్ జాబితాను మంగళవారం జిల్లా కో ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్,తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.


