News April 17, 2025

ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

image

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

Similar News

News January 6, 2026

‘ఖమ్మం జిల్లాలో యూరియా స్టాక్ పుష్కలంగా ఉంది’

image

ఖమ్మం జిల్లాలో యూరియా స్టాక్‌పై దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని, జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన మేర స్టాక్ పుష్కలంగా అందుబాటులో ఉందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేందుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 11,817 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటివరకు రైతులకు 25,773 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని పేర్కొన్నారు.

News January 6, 2026

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఖమ్మం సీపీ

image

కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జరగకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా గతంలో కోడిపందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

News January 6, 2026

ఖమ్మం: ఏప్రిల్‌లో రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్లు

image

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి విడతలో మంజూరైన 16,523 ఇళ్లలో ఇప్పటికే 7,341 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకోగా, 324 ఇళ్లు పూర్తికావచ్చాయి. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోంది. వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. పాతగృహలక్ష్మి ఇళ్లను సైతం ఇందిరమ్మ పథకంలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు తెలిపారు.