News April 17, 2025
మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Similar News
News April 19, 2025
సిక్సర్ల రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ KL రాహుల్ రికార్డు సృష్టించారు. IPLలో భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్సులలో 200 సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో సిక్సర్ బాది రాహుల్ ఈ ఫీట్ సాధించారు. రాహుల్ 129 ఇన్నింగ్సుల్లో 200 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 69Inns, ఆండ్రీ రస్సెల్ 97Inns తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
News April 19, 2025
అరెస్టైన కాసేపటికే నటుడికి బెయిల్

నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ మంజూరైంది. నటితో అసభ్యకరంగా ప్రవర్తించారనే కేసులో ఇవాళ మధ్యాహ్నం ఆయనను కొచ్చి పోలీసులు <<16150036>>అరెస్ట్<<>> చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కొచ్చి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దసరా సినిమాతో ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.
News April 19, 2025
CBN బర్త్ డే.. CDP రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ కామన్ డీపీని విడుదల చేశారు. ఫొటోలో పోలవరం ప్రాజెక్టు, ఏపీ సచివాలయం, ఎంఎంటీఎస్ రైళ్లు, సైబర్ టవర్స్, కియా ఫ్యాక్టరీ, అన్న క్యాంటిన్, బుద్ధ వనాలను చూపించారు. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో చంద్రబాబు కీలకం అని తెలిపేలా CDPని రూపొందించారు.