News March 28, 2024

కర్నూలు: ‘క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనల నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News September 29, 2025

రాయలసీమ: ఆర్.యు పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఆదివారం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్రావు బసవరావు విడుదల చేశారు. పీ. జీ రెండవ సెమిస్టర్ లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు ఫలితాలను రాయలసీమ యూనివర్సిటీ వెబ్సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.

News September 28, 2025

తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

image

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్‌లోడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై ముఖ్య సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

News September 28, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ తీగలు, నీటి ప్రవాహం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ (08518-277305) పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.