News March 28, 2024
శుభ ముహూర్తం

తేదీ: మార్చి 28, గురువారం
బహుళ తదియ: సాయంత్రం 06:57 గంటలకు
స్వాతి: సాయంత్రం 06:38 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 10:11-10:59 గంటల వరకు
మధ్యాహ్నం 03:02-03:50
వర్జ్యం శేషం: తెల్లవారుఝాము 12:10
Similar News
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
News March 18, 2026
వరి పండిస్తే అత్యధిక లాభం రాదు: రేవంత్

TG: రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలి. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతాం. రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో తెలిపారు.
News March 18, 2026
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.


