News March 28, 2024

మాల్దీవ్స్‌లో తాగునీటి కొరత

image

చుట్టూ సముద్రపు నీరున్నా తాగునీరు లేక మాల్దీవ్స్ అల్లాడుతోంది. నీటి కొరతను అధిగమించేందుకు టిబెట్(రిపబ్లిక్ ఆఫ్ చైనా) నుంచి 1,500 టన్నుల నీటిని తెచ్చుకుంది. ఈ అంశంలో మాల్దీవ్స్‌కు సాయం చేస్తామని టిబెట్ గతేడాదే హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే భారత్‌తో వివాదం పెట్టుకున్నప్పటి నుంచి మాల్దీవ్స్‌ను వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆ దేశం ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోయింది.

Similar News

News March 8, 2026

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. నేడు CBN హాజరు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ మూడు రోజుల క్రతువు ఇవాళ్టితో ముగియనుంది. నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

News March 8, 2026

T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

image

INDvsNZ <<19325584>>ఫైనల్<<>> కోసం అహ్మదాబాద్ స్టేడియంలో మిక్స్‌డ్ సాయిల్ పిచ్ (70% రెడ్, 30% బ్లాక్) రెడీ చేశారు. బౌలర్లకు బౌన్స్ లభిస్తుంది. పేసర్లకు సహకరిస్తుంది. బ్యాటర్లకూ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా. Dew వచ్చే అవకాశముంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్సుంది. ఈ పిచ్‌ను SAvsCAN (feb 9) మ్యాచుకు వాడారు. SA 213/4 స్కోర్(1st బ్యాటింగ్) చేసి, 57 రన్స్ తేడాతో గెలిచింది.

News March 8, 2026

6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం: IRGC

image

ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్టేట్ మీడియాకు వెల్లడించింది. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.