News April 18, 2025
IPL: SRH చెత్త రికార్డ్

MIతో నిన్నటి మ్యాచ్‌లో ఓటమితో SRH బయటి పిచ్‌ల మీద పరాజయాల పరంపర కొనసాగించింది. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో కాకుండా SRH వైజాగ్, కోల్‌కతా, ముంబైలో మ్యాచ్‌లు ఆడి, వాటన్నింటిలోనూ ఓడింది. మరోవైపు, మిగతా అన్ని జట్లు బయట ఆడిన మ్యాచ్‌లు గెలిచాయి. ఉప్పల్ వంటి బ్యాటింగ్ పిచ్ అయితే SRH భారీ స్కోర్ చేస్తుండటం గమనించిన మిగతా జట్లు స్లో పిచ్‌లను సిద్ధం చేయిస్తున్నాయి. ఆపై తక్కువ రన్స్‌కే కట్టడి చేసి నెగ్గుతున్నాయి.
Similar News
News February 1, 2026
నిర్మలమ్మ చీరలే స్పెషల్ ఎట్రాక్షన్

ఏటా బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చేనేత చీరలు కూడా స్పెషల్‌గా నిలుస్తాయి. ఈసారి బంగారు, నలుపు వర్ణం అంచుతో ఉన్న మెరూన్ రంగు కాంజీవరం చీర, గోల్డెన్ కలర్ బ్లౌజ్, శాలువాతో కన్పించారు. 2025లో మధుబని చిత్రాలున్న చీర, 2024లో కాంతా చీర, 2023లో టెంపుల్ బోర్డర్ శారీ, 2022లో ఒడిశా చేనేత శారీ, 2021లో భూదాన్ పోచంపల్లి చీర, 2020లో బంగారు వర్ణపు చీర, 2019లో మంగళగిరి చీర ధరించారు.
News February 1, 2026
భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.
News February 1, 2026
జిల్లాకో గర్ల్స్ హాస్టల్: కేంద్రం ప్రకటన

సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటుచేయాలని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. కాలేజీ తరగతులు, ల్యాబుల్లో పరిశోధనలు ఇతర అధ్యయనాలకు ఎక్కువ కాలం వారు వెచ్చించాల్సి వస్తోంది. వారు సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వారికి సదుపాయంగా ఈ హాస్టళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి వివరించారు.


