News April 18, 2025
HYD: గోల్కొండ కోటలోకి FREE ENTRY

వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా హైదరాబాద్ వాసులకు శుభవార్త. శుక్రవారం గోల్కొండ ఫోర్ట్‌లోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందని సీనియర్ పరిరక్షణ అధికారి మల్లేశం వెల్లడించారు. ప్రతి యేటా ఈ రోజు ఉచితంగా కోటను సందర్శనకు అనుమతి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చారిత్రక కట్టడాలకు ఈ వెసులుబాటు కల్పించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గోల్కొండ కోట అధికారులు సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News July 8, 2025
HYD: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఓయూ వీసీ

TG హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం కలిశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ డా.BR అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఈనెల 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించనున్నారు. దీంతో హైకోర్టు ప్రాంగణంలో కలసి ఆహ్వానించారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఉన్నారు.
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2025
పంజాగుట్ట సర్కిల్ పరిధిలో భారీగా ట్రాఫిక్

HYDలో రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతుంది. పంజాగుట్ట X రోడ్- కోఠి రూట్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వెంగళ్‌రావు పార్క్, పంజాగుట్ట X రోడ్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్, చట్నీస్ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్ వైపు పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.