News March 28, 2024

NZB: పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్

image

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు టీఎస్ఎస్సీ స్టీడీ సర్కిల్, షెడ్యూల్డ్ కులాల అభివృది శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్న ఎస్సీ అభ్యర్థుల దీనికి అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News March 12, 2026

నిజామాబాద్ GGHలో వరల్డ్ కిడ్నీ డే

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లోని డయాలసిస్ కేంద్రంలో గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాస్ డయాలసిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముందే డయాలసిస్ వరకు రాకుండా కేర్ తీసుకొని హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటించాలని సూచించారు. డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

News March 12, 2026

NZB: వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు: DMHO

image

ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తికి పాల్పడితే వారిపై ఎంటీపీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని NZB DMHO డా.రాజశ్రీ హెచ్చరించారు. గురువారం నిర్వహించిన గర్భస్త పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీసీపీఎన్‌డీటీలో నమోదు అయిన వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలని సూచించారు.

News March 12, 2026

NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.