News April 18, 2025

VZM: వాట్సాప్ సర్వీసులను ఉపయోగించుకోవాలి

image

గ్రామ, వార్డు సచివాలయ సర్వీసులను వాట్సాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో వాట్సాప్ గవర్నర్ అవగాహన బ్రోచర్లను గురువారం ఆవిష్కరించారు. దీని గురించి ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.  గ్రామ, వార్డు సచివాలయ స్పెషలాఫీసర్ రోజా రాణి, బొబ్బిలి డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

VZM: నేడు చిత్రలేఖనం పోటీలు

image

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహిస్తున్నామని డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. నేడు మండల స్థాయిలో, ఈనెల 9న జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పొగాకు, మత్తు పదార్థాల వినియోగంపై చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం, గౌరవ మర్యాదలు అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు.

News July 6, 2025

భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

image

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.

News July 6, 2025

జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

image

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.