News April 18, 2025

నరసాపురం: నేటి నుంచి తీరంలో అధికారులు సర్వే

image

చేపల వేటపై నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు మత్స్యకార భృతి అందించేందుకు సర్వే చేపడుతున్నట్లు నరసాపురం మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ ఎల్ఎన్ఎన్ రాజు తెలిపారు. ఈ నెల 18-23తేదీ వరకూ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే నిర్వహించనున్నారు. సిబ్బంది మత్స్యకారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర వివరాలను సేకరించనున్నారు.

Similar News

News April 19, 2025

వల్లూరులో సందడి చేసిన సినిమా యూనిట్

image

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మధురం’ చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో సందడి చేసింది. తాను తీసిన మొదటి సినిమాను ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలని వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ కోరారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News April 19, 2025

భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.

News April 19, 2025

ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

error: Content is protected !!