News April 18, 2025
నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
Similar News
News April 19, 2025
కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.
News April 19, 2025
బూర్జ : స్విమ్మింగ్‌లో అరుదైన రికార్డు

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్‌గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.
News April 19, 2025
బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.