News March 28, 2024
విశాఖ నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులు

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశీయ సర్వీసుల్లో ఈ నెల 31 నుంచి విశాఖపట్నం–ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా, విశాఖపట్నం–హైదరాబాద్ మధ్య ఇండిగో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ సర్వీసుల్లో విశాఖ–బ్యాంకాక్(థాయ్‌లాండ్) విమానం ఏప్రిల్ 9 నుంచి, విశాఖ–కౌలాలంపూర్ (మలేసియా) విమానం ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుంది.
Similar News
News March 10, 2026
విశాఖలో నేడు అంతర్జాతీయ నీటి భద్రతా సదస్సు

విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం నోవాటెల్ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెరుగుతున్న నీటి అవసరాలు, వనరుల సమర్థ వినియోగం, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారని అధికారులు పేర్కొన్నారు.
News March 9, 2026
విశాఖలో బ్యాడ్మింటన్ ఆడేవారికి గుడ్ న్యూస్

విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ మెంబర్‌షిప్ కోసం జీవీఎంసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 6 అంతర్జాతీయ స్థాయి కోర్టులతో కూడిన ఈ స్టేడియంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు ఏడాదికి ₹2,600, పెద్దలకు ₹15,000 ఫీజుగా నిర్ణయించారు. ఉదయం 5 నుండి 10 వరకు, సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఆడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
News March 9, 2026
విశాఖ: హిందుజా పవర్ ప్లాంట్‌కు భారీ జరిమాన

విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్‌పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్లాంట్ నుంచి వచ్చే యాష్పాండ్ ధూళి వలన స్థానిక ప్రజలు చర్మవ్యాధులు బారిన పడుతున్నారని టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హిందుజా పవర్ ప్లాంట్‌కు రూ.6 కోట్ల 78 లక్షలు జరిమానా విధించింది.


