News April 18, 2025
మహబూబ్‌నగర్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SBI RSETI సంస్థ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ తెలిపారు. సెల్ ఫోన్ సర్వీస్ & రిపేరింగ్ కోర్సులో ఈనెల 21లోగా SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. వయస్సు 19-45 ఏళ్లలోపు ఉండాలన్నారు.మిగతా వివరాలకు 95424 30607, 99633 69361 సంప్రదించాలన్నారు. #SHARE IT
Similar News
News November 10, 2025
MBNR: సాఫ్ట్‌బాల్.. 2nd PLACE

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
News November 9, 2025
BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
MBNR: ఈనెల 12న అథ్లెటిక్స్ ఎంపికలు: శారదాబాయి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో బాల, బాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. MBNRలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9:00 గంటలలోపు పీడీ ఆనంద్ కుమార్‌కి రిపోర్ట్ చేయాలన్నారు.


