News March 28, 2024

తిరుపతిలో టీడీపీ నేత ఇంట్లో సోదాలు

image

తిరుపతిలో టీడీపీ నేత కోడూరు బాలసుబ్రమణ్యం ఇంట్లో 15 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఆయన మాట్లాడుతూ.. 15 మంది అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయడం బాధాకరమన్నారు. తమ లాంటి వ్యక్తులపైనే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

Similar News

News September 29, 2025

MP మిథున్ రెడ్డి బెయిల్‌పై నేడు తీర్పు

image

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన MP పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ACB కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. దీంతో MPకి బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

News September 29, 2025

ఘోరం.. ఇసుకలో బిడ్డ లభ్యం

image

వరదయ్యపాలెంలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి ఆడ శిశువుకు జన్మనిచ్చి అక్కడే ఉన్న ఇసుకలో పూడ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 29, 2025

అక్రమ కేసులు పెడుతున్న వారికి తిప్పలు తప్పవు: రోజా

image

YCP శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. ఆదివారం ఆమె డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనతరం మాట్లాడుతూ.. YCP శ్రేణులపై దాడులే లక్ష్యంగా నిరంకుశ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తమ వివరాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.