News April 18, 2025

IPL: RCB vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPLలో నేడు బెంగళూరు వేదికగా RCB, PBKS తలపడనున్నాయి. అయితే, ఆ నగరంలో ఇవాళ ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వరుణుడు అడ్డుపడకుంటే మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సుంది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా.. PBKS(17), RCB(16) మ్యాచుల్లో విజయం సాధించాయి.

Similar News

News April 20, 2025

ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

image

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.

News April 20, 2025

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.

News April 20, 2025

బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

image

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.

error: Content is protected !!