News April 18, 2025
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తా.. కేసులకు భయపడను: భూమన

AP: SV గోశాలలో ఆవుల మృతిపై మాట్లాడినందుకు తన మీద <<16135353>>కేసులు పెట్టడంపై<<>> టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని విమర్శించారు.
Similar News
News February 4, 2026
FLASH: తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. ఇవాళ <<19045966>>ఉదయం<<>> భారీగా పెరిగిన గోల్డ్ రేటు సాయంకాలానికి కాస్త తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,090 తగ్గి రూ.1,59,440కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 పతనమై రూ.1,46,150 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,20,000గా ఉంది.
News February 4, 2026
అదానీ డేటా సెంటర్‌కు భూ కేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

AP: విశాఖ జిల్లాలో 480 ఎకరాలను డేటా సెంటర్ కోసం అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచితంగా కేటాయించడంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ధీరజ్ సింగ్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ఆదేశించింది. పాలసీ ప్రకారం ఉచితంగా భూమి ఇచ్చే అధికారం GOVTకు లేదని న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. సేల్‌డీడ్ రాస్తే ప్రాజెక్టు పూర్తికాకున్నా వెనక్కి తీసుకొనే అధికారం ఉండదని తెలిపారు.
News February 4, 2026
వెనిజులా ఆయిల్ కొంటే $3 బిలియన్లు ఆదా: SBI రిపోర్ట్

రష్యాకు బదులు వెనిజులా చమురు కొనుగోలు చేస్తే భారత్‌కు ఏటా 3 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. బ్యారెల్‌పై 10-12 డాలర్ల డిస్కౌంట్ లభిస్తేనే ఇది సాధ్యమని లేదంటే కష్టమని పేర్కొంది. అయితే రష్యా, మిడిల్ ఈస్ట్‌తో పోలిస్తే వెనిజులా భారత్‌కు దూరంగా ఉండటం, రవాణా భారం ఉండటం మైనస్ అని పేర్కొంది. అయితే వెనిజులా ఆయిల్ భారత్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపింది.


