News April 18, 2025
ఖమ్మం: CMRF గందరగోళం.. ఆసుపత్రులకు నోటీసులు

పేదలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులను ఖమ్మంలోని పలు ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షల విలువ గల CMRF చెక్కులను కాజేశాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓకు అందిన ఫిర్యాదుతో పలు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేడు తాజాగా ఆ ఆసుపత్రులకు నోటీసులు పంపి, రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. పేదలకు అందాల్సిన పథకం నిర్వీర్యం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.
Similar News
News April 20, 2025
ఖమ్మం: ‘సీఎం వస్తేనే పెళ్లి ఖరారు చేసుకుంటా’

CM రేవంత్ రెడ్డిని తన పెళ్లికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు యువజన కాంగ్రెస్ నేత భూక్య గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. కారేపల్లి మండలం మేకలతండాకి చెందిన గణేష్ తనకు పెళ్లి కుదిరిందని సీఎం వచ్చిన రోజే తాను పెళ్లి తేదీ ఖరారు చేస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి సీఎంకు రావాలని రిక్వెస్ట్ లెటర్ పంపారు. ఈ లెటర్ జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.
News April 20, 2025
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

ఖమ్మం: నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క అన్నారు. శనివారం మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 1317 మంది రైతుల నుండి రూ.24.66 కోట్ల విలువ గల 10628.760 మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు అదనపు కలెక్టర్ మంత్రులకు వివరించారు.
News April 20, 2025
21 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి: DEO

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగే ప్రవేశ పరీక్షల కొరకు విద్యార్థులు ఈ నెల 21 నుంచి http://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని DEO సోమశేఖరశర్మ తెలిపారు. ఈనెల 27న 6వ తరగతి విద్యార్థులకు ఉ.10 గంటల నుంచి మ.12.00 గంటల వరకు, 7వ, 10వ తరగతి విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.