News March 28, 2024

సదరం స్లాట్లు విడుదల

image

AP: ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వీరికి ఏప్రిల్ 8 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ENT వైద్యులు టెస్టులు చేసి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ బుక్ అయినా నో డెలివరీ! మీకూ ఈ సమస్య ఉందా?

image

వంటగ్యాస్ ఇబ్బందులు తప్పట్లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్యాస్ బుక్ అయినా OTP రావట్లేదని, సిలిండర్ డెలివరీ కావట్లేదని వాపోతున్నారు. 4-5 రోజులుగా ఎదురుచూస్తున్నా స్పందన లేదంటున్నారు. కాగా కొందరు ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ తెచ్చుకుంటున్నారు. మరి గ్యాస్ బుకింగ్, డెలివరీలో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో కామెంట్ చేయండి.

News March 14, 2026

కోడి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

ఎండలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కోడి పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి వేడి ఒత్తిడికి గురైతే నీరసంగా మారతాయి. విరేచనాలు అయ్యి నిలబడలేక వణుకుతుంటాయి. అలాగే అవి మెడలు వాల్చి సన్నగా మూలుగుతూ ఉన్నా, వాటి కంటి నుంచి నీరు కారుతున్నట్లు గుర్తించినా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలున్న కోడి పిల్లలను, కోళ్లను షెడ్డులోని మిగిలిన వాటి నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.

News March 14, 2026

‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

image

<<15204583>>వివాదాస్పద సంభల్‌‌<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.