News April 18, 2025
కథలాపూర్ పీహెచ్సీలో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తినష్టం

కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ గదిలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రూ.25 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాక్సినేషన్ గదిలోని నాలుగు ఫ్రిడ్జ్లు, వాక్సిన్లు పూర్తిగా కాలిపోయాయి.
Similar News
News January 1, 2026
జోగి రమేశ్‌కు రూ.కోటి ముడుపులు?

AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులపై సప్లిమెంటరీ-2 ఛార్జ్‌షీటును సిట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ₹కోటికిపైగా ముడుపులు రమేశ్‌కు ఇచ్చారని సిట్ పేర్కొన్నట్లు తెలిసింది. 2021-23 మధ్య పలు విడతల్లో ఇచ్చారని సమాచారం. అద్దేపల్లి సోదరులు, రమేశ్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో 17 మంది నిందితులకు విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.
News January 1, 2026
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంతంటే?

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చి త్రైమాసికానికి ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా 8వ క్వార్టర్‌లోనూ వడ్డీ రేట్లను సవరించకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన-8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్, PPF-7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్-4%, కిసాన్ వికాస్ పాత్ర-7.5, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-7.7, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్-7.4% వడ్డీ రేట్లు ప్రస్తుతమున్నాయి.
News January 1, 2026
ఒత్తువాములు కోరుతుంది, పలచన పాతర్లు కోరుతుంది

వాము (ఓమ) పంటను సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా (ఒత్తుగా) ఉండాలి. అప్పుడే ఆ పంట దిగుబడి బాగుంటుంది. పాతర్లు (అంటే వరి నారు లేదా ఇతర కొన్ని రకాల పంటలు) నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం (పలచనగా) ఉండాలి. అప్పుడే ఆ మొక్కలకు గాలి, వెలుతురు సరిగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ పంటకు ఎంత దూరం ఉండాలో తెలిపే వ్యవసాయ సూత్రాన్ని ఈ సామెత చెబుతుంది.


