News April 19, 2025

శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 16, 2026

పాణ్యం మండలంలో విషాదం

image

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News January 16, 2026

కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.