News March 28, 2024

తెలంగాణలో ఎంతమంది ఓటర్లంటే..

image

TS: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.3 కోట్లుగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. వీరిలో 1,65,95,896మంది మహిళలు, 1,64,14,693మంది పురుషులు, 2729మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. ఇక తొలితరం ఓటర్లు 8,72,116మంది, 85ఏళ్లు దాటినవారు 1,93,489మంది, దివ్యాంగులు 5,26,286మంది, సర్వీసు ఓటర్లు 15,472మంది, ఎన్నారై ఓటర్లు 3409మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News November 6, 2024

అమెరికా ఎన్నికలు.. ఆధిక్యంలో ఎవరంటే?

image

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు Real Clear Polling సైట్ తెలిపింది. పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ 219, కమలా హారిస్ 211 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, పెన్సిల్వేనియా, విస్కన్సిన్, ఆరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాల్లోని 108 ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.

News November 6, 2024

స్వింగ్ స్టేట్‌కు న‌కిలీ బాంబు బెదిరింపులు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాంబు బెదిరింపులు క‌ల‌కలం రేపాయి. కీలకమైన ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఒక‌టైన జార్జియాలోని ఫుల్ట‌న్ కౌంటీలో ఐదు పోలింగ్ స్టేష‌న్ల‌కు బెదిరింపులు వచ్చాయి. అయితే, వీటిని న‌కిలీవిగా తేల్చిన‌ట్టు కౌంటీ ఎన్నిక‌ల అధికారి న‌డైన్ విలియ‌మ్స్ తెలిపారు. 5 స్టేష‌న్ల‌లో రెండింటిని అర‌గంట‌పాటు ఖాళీ చేయించిన‌ట్టు ఆయన వెల్ల‌డించారు. అనంత‌రం తిరిగి పోలింగ్ ప్రారంభించామని తెలిపారు.

News November 5, 2024

బరాక్ ఒబామాకు సిద్ద రామయ్య ఆహ్వానం

image

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాకు CM సిద్ద రామ‌య్య ప్ర‌త్యేక ఆహ్వానాన్ని పంపారు. 1924లో బెల‌గావిలో జరిగిన 39వ భార‌త జాతీయ కాంగ్రెస్ స‌ద‌స్సు అధ్య‌క్షుడిగా మ‌హాత్మా గాంధీ బాధ్య‌త‌లు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల బెలగావిలో శతాబ్ది ఉత్సవాలతోపాటు శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒబామాను సిద్ద రామయ్య కోరారు.