News April 19, 2025
ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 19, శనివారం)

ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు అసర్: సాయంత్రం 4.42 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు ఇష: రాత్రి 7.48 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 20, 2025
చంద్రబాబుకు మోదీ, రేవంత్, చిరు శుభాకాంక్షలు

‘నా మిత్రుడు, CM చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని PM మోదీ పోస్ట్ చేశారు. ‘నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ AP అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని TG సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ‘కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలి’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.
News April 20, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. నిన్న 78,821 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 33,568 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.
News April 20, 2025
IPL: CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

CSK ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ధోనీ సేన NRR -1.276గా ఉంది. ఇది మెరుగవ్వాలంటే భారీ తేడాలతో మ్యాచులు గెలవాలి. CSK ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అనుకుంటున్నారా? మీ కామెంట్.