News March 28, 2024

రాజానగరంలో భారీ అగ్ని ప్రమాదం

image

మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో సుమ రిఫైనరీ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆయిల్ ముడిసరుకు బాయిలర్ శుభ్రం చేయడానికి మరమ్మతులు చేస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని యాజమాన్యం తెలిపారు.

Similar News

News March 5, 2026

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

image

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.

News March 5, 2026

రాజమండ్రి కల్తీ పాలు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

image

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం (1:25 PM) హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 11 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు 8 మంది మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.వెంకటలక్ష్మి (69) మృతి చెందినట్లు తెలిపారు.

News March 5, 2026

రాజమండ్రి: 7, 8 తేదీల్లో జిల్లాలో ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పర్యటన

image

జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా ఈనెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన 6వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం చేరుకొని ఓఎన్‌జీసీ అతిథి గృహంలో బస చేస్తారు. 7న జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహింనున్నారు. అనంతరం ధవళేశ్వరంలో నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొని, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.