News March 28, 2024

టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు: విద్యాశాఖ

image

TG: ప్రభుత్వ టీచర్లు టెట్ రాయడానికి విద్యాశాఖ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆ శాఖ కమిషనర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు. టెట్ రాసేందుకు టీచర్లు అనుమతి తీసుకోవాలని 2 రోజుల క్రితం టెట్ కన్వీనర్ చెప్పిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో టీచర్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రీదేవసేన తెలిపారు. కాగా టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది.

Similar News

News November 5, 2024

అమెరికా ఎన్నికల్లో కౌంటింగ్ విధానం

image

అమెరికా ఎన్నికల్లో పోలైన ఓట్లను ముందుగా లెక్కిస్తారు. తర్వాత పోస్ట‌ల్ బ్యాలెట్, అభ్యంతరాలు ఉన్న ఓట్లను, విదేశాల్లో ఉన్నవారి ఓట్లు లెక్కిస్తారు. ఉన్న ఓట్ల‌తో పోలైన ఓట్ల‌ను వెరిఫై చేస్తారు. ప్ర‌తి బ్యాలెట్‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి డ్యామేజీ, చిరిగిన వాటిని చెల్ల‌ని ఓట్లుగా ధ్రువీక‌రిస్తారు. మొత్తంగా పేప‌ర్ బ్యాలెట్‌, ఎల‌క్ట్రానిక్ బ్యాలెట్‌, మెయిల్‌-ఇన్ ఓట్ల‌ను స్కాన్ చేసి ఫ‌లితాల‌ను లెక్కిస్తారు.

News November 5, 2024

రేపు మంత్రివర్గ సమావేశం

image

AP: రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జీవో 77 రద్దుతో పాటు స్పోర్ట్స్, డేటా సెంటర్, డ్రోన్, సెమీకండక్టర్ పాలసీలకు ఆమోదం తెలిపే ఛాన్సుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 స్థానంలో కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. YCP ప్రభుత్వం తెచ్చిన నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది.

News November 5, 2024

అంబానీ వెడ్డింగ్‌లో 120రకాల టీలు పెట్టిన మాస్టర్

image

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఎన్నో విషయాల్లో స్పెషాలిటీ చాటుకుంది. అందులో సర్వ్ చేసిన టీ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే కుంకుమపువ్వు టీ, పాన్ ఫ్లేవర్ టీతో పాపులరైన మధ్యప్రదేశ్‌కు చెందిన లక్ష్మణ్ ఓజా ఈ శుభకార్యంలో టీ మాస్టర్. ఒకట్రెండు కాదు ఏకంగా 120 రకాల టీలను అతిథులకు అందించారు. దాదాపు 15ఏళ్లుగా ఆయన టీ తయారు చేస్తున్నారు. అంబానీ ఇంట దక్కిన అవకాశంతో తన ఇన్నేళ్ల కృషి ఫలించినట్లైందని అన్నారు.