News March 28, 2024

నారా భువనేశ్వరిపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘నిజం గెలవాలి’ యాత్ర పేరుతో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమె డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ వార్త విని మరణించిన వారికి సాయం చేస్తున్నారని.. అయితే వారంతా బాబు అరెస్ట్‌ వార్తతోనే చనిపోయారనడానికి ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2026

ఆసీస్ ప్లేయర్లు కావాలనే రావడం లేదా?

image

IPL ఆరంభ మ్యాచులకు కమిన్స్(SRH), స్టార్క్(DC), హేజిల్‌వుడ్(RCB) రావడం లేదు. ఎల్లిస్(CSK) సీజన్ మొత్తానికి దూరమయ్యారు. గాయాల భయంతో ఆస్ట్రేలియన్లు IPL ఆడేందుకు ఇష్టపడడం లేదని, కావాలనే మ్యాచులకు డుమ్మా కొడుతున్నట్లు కొందరు IND ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్రాంచైజీల నుంచి రూ.కోట్లు తీసుకుంటూ స్వదేశం తరఫున ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు వేలంలో పాల్గొనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?

News March 20, 2026

కాంగ్రెస్‌ది చోర్ విధానం: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, GSDP తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం. 6 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. BRS హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉంటే ఇప్పుడు 10.2%గా ఉంది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఇది తగ్గింది. బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వ చేతగానితనం అర్థమైంది’ అని ప్రెస్‌మీట్‌లో ఫైరయ్యారు.

News March 20, 2026

అంతరిక్షంలో 129 ఇస్రో వ్యర్థాలు: కేంద్రం

image

ఇస్రో ప్రయోగించిన రాకెట్ల శకలాలు, ఫెయిలైన శాటిలైట్లు అంతరిక్షంలో 129 ఉన్నాయని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. వీటిలో 49 ఉపయోగం లేని ఉపగ్రహాలు ఉన్నాయని తెలిపింది. అందులో భూమికి సమీప కక్ష్య(LEO)లో 23, భూస్థిర కక్ష్య(GEO)లో 26 ఉన్నాయంది. మిగిలినవాటిలో PSLV శకలాలు 40, GSLV 4, LVM3 వ్యర్థాలు 3, PSLV-C3 రాకెట్ భాగం విచ్ఛిన్నం కావడంతో ఏర్పడిన 33 శకలాలు కూడా ఉన్నాయని పేర్కొంది.