News April 19, 2025

వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

image

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNRలో అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, బాపు, జరఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనేపదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.

Similar News

News January 9, 2026

Kmcలో ఘనంగా ముగిసిన క్రితి 3.0

image

కాకతీయ మెడికల్ కాలేజ్‌లో నిర్వహించిన క్రితి 3.0 కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. పోస్టర్ ప్రెజెంటేషన్లు, సర్జికల్ స్కిల్స్ డెమోన్స్ట్రేషన్లు, మెడ్ ఎగ్జిబిషన్, సింపోజియం, CME టాక్స్ వంటి విభిన్న కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. kmc ప్రిన్సిపల్ డా.సంధ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డా.శ్రీనాథ్ రెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.హనిమిరెడ్డి వైద్యులు పాల్గొన్నారు.

News January 9, 2026

వీఆర్‌ఓల పనితీరులో మార్పు అవసరం: కలెక్టర్

image

ఐవీఎస్ సర్వేలో 13 మంది వీఆర్‌ఓలు కేవలం 50 శాతం మాత్రమే పనితీరు కనబరిచిన నేపథ్యంలో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం లేకుండా, సమయానికి అందించాలని వీఆర్‌ఓలను ఆదేశించారు. సంబంధిత వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పనితీరులో స్పష్టమైన మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ గంగధర్ గౌడ్ ఉన్నారు.

News January 9, 2026

వరంగల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వంట సిబ్బంది తొలగింపు

image

వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.